మన్యం వీరుడు, అల్లూరి సీతారామరాజు జీవిత గాధను రాబోయే తరాలు గుర్తుంచుకునే విధంగా ఆయన జీవిత గాధలను ప్రచారం చేయవలసిన అవసరం ఉందని క్షత్రియ సేవా సంఘం నాయకులు చింద వెంకటేశ్వర్లు రాజు తెలిపారు. శనివారం ఉయ్యూరు మండలం రాజపేట గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 8వ తేదీ ఆదివారం ఉయ్యూరు మండలం రాజుపేట గ్రామంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు.