ఏ.కొండూరులో పంచాయతీ ఛాంపియన్స్ సమావేశం
By KOLA 77చూసినవారుఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ఆదేశాల మేరకు హైదరాబాద్ జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ సంస్థ (ఎన్. ఐ. ఆర్. డి. పి. ఆర్) లో సమగ్ర గ్రామీణాభివృద్ది కోసం శిక్షణ పొందిన పంచాయతీ చాంపియన్స్ మంగళవారం ఎ. కొండూరు మండలం కృష్ణారావుపాలెం గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో తాగునీరు-సాగునీరు సమస్య రాకుండా, వ్యవసాయం, పరిసరాల పరిశుభ్రత, అంశంపై అవగాహన కల్పించారు.