ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మైలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు రెడ్డిగూడెంలో గురువారం పర్యటించారు. కూటమి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలను సందర్శించారు. ఈ సందర్భంగా కూటమి కుటుంబ సభ్యులు గ్రాడ్యుయేట్ ఓటర్లకు అందిస్తున్న సేవలను స్వయంగా పరిశీలించారు. ఓటర్లు అందరూ వారి ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.