సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసే కోడిపందాలు పేకాట శిబిరాలకు ప్రజలు దూరంగా ఉండాలని తిరువూరు సిఐ గిరిబాబు అన్నారు. నర్సంపేట మండలంలోని పలు గ్రామాల్లో కోడిపందాల బరులను వారు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా విస్సన్నపేట పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గీత దాటి కోడి పందేలు, పేకాట నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సంక్రాంతి పండుగ సాంప్రదాయంగా జరుపుకోవాలని ఎస్సై రామకృష్ణ అన్నారు.