తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి తిరువూరు పంచాయతీ చేరింది. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఇవాళ (శనివారం) తిరువూరు టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా తిరువూరు నియోజకవర్గ టీడీపీ నేతలు ఒకటయ్యారు. డౌన్ డౌన్ కొలికపూడి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యకర్తలను టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సముదాయించారు. పార్టీయే సుప్రీమ్, పార్టీ లైన్ దాటితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎంతటి వారైనా చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని వార్నింగ్ ఇచ్చారు.