మీ సమస్యలు ఏంటమ్మా మీకు ప్రభుత్వం నుండి ఏం పథకాలు అందుతున్నాయి అంటూ తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు సోమవారం మన ఊరు తిరువూరు అనే కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. ఎమ్మెల్యే స్వయంగా ప్రజా సమస్యలను తన డైరీలో రాసుకుంటున్నారు. మీ సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరిస్తారని స్థానికులకు హామీ ఇస్తున్నారు.