కదిరి: "బాల్యవివాహాలు ఆపితేనే నవ సమాజ నిర్మాణం"
సమాజంలో బాల్యవివాహాలు ఆపితేనే ఆరోగ్యకర నవ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని నల్లచెరువు సీడీపీఓ గంగరత్న పేర్కొన్నారు. బుధవారం సూపర్వైజర్ ఖాజీ రఫీమున్నీసా అధ్యక్షతన ఎంపీడీఓ కార్యాలయ సమావేశ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బాల్యవివాహాలపై సమీక్షించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీవో రఘునాథ గుప్త, చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ కొండప్ప, సమత స్వచ్చంద సంస్థ కో ఆర్డినేటర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.