పాణ్యం: రీసర్వేలో జరిగిన అవకతవకలు సరిచేయాలి
గత ప్రభుత్వ హయాంలో రీసర్వే పేరుతో రైతుల భూముల్లో జరిగిన అవకతవకలను సరిచేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రామకృష్ణ, మండల కార్యదర్శి నాగన్న డిమాండ్ చేశారు. గురువారం ఓర్వకల్లు మండలం కేతవరంలో జరుగుతున్న రెవెన్యూ గ్రామసభలో గ్రామస్తులతో కలిసి తహశీల్దార్ విద్యాసాగర్ కు వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. గ్రామంలో ప్రభుత్వ భూములను సాగు చేసుకున్న అర్హులైన వారికి పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలన్నారు.