పాణ్యం: రూ. 12 కోట్లతో కాల్వబుగ్గ ఆలయ అభివృద్ధికి ప్రణాళిక
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ శ్రీరామేశ్వర దేవాలయాన్ని రూ. 12 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయుటకు ప్రణాళిక సిద్దం చేసినట్లు టీటీడీ పాలకమండలి సభ్యులు మల్లెల రాజశేఖర్ తెలిపారు. సోమవారం తిరుమలలో కొత్తగా ఏర్పడిన టీటీడీ పాలకమండలి సమావేశంలో మల్లెల రాజశేఖర్ సిద్దం చేసిన ప్రణాళికను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు అందజేశారు. బుగ్గరామేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.