దళిత మహిళ గోవిందమ్మను ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గురువారం ఎమ్మిగనూరు ఆసుపత్రిలో పరామర్శించారు. పెద్దకడబూరు మండలం కల్లుకుంటలో దళిత మహిళ గోవిందమ్మపై అగ్రవర్ణాలు విచక్షణ రహితంగా దాడి చేశారు. గోవిందమ్మ ఆరోగ్య స్థితిగతుల గురించి వైద్య అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం తరఫున రావాల్సిన పరిహారాన్ని త్వరగతిన అందిస్తామన్నారు.