ఎమ్మిగనూరు: ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి
అదానీని అరెస్టు చేయాలని సీపీఐ కర్నూలు జిల్లా నాయకులు ఎం. సత్యన్న డిమాండ్ చేశారు. మంగళవారం ఎమ్మిగనూరులోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడారు. మూడోసారి అధికారంలో వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ, పేద ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.