ఆదోని సబ్ డివిజన్ పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు ఇచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆధికారులను ఆదేశించారు. సోమవారం ఆదోని సబ్ కలెక్టర్ వారి కార్యాలయం సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ వినతులను స్వీకరించి, వారు మాట్లాడారు. నిర్ణీత సమయంలోగా అర్జీలను పరిశీలించి, పరిష్కరించాలని ఆదేశించారు.