బీజేపీ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా బీసీ నేత ఆర్. కృష్ణయ్య ఎంపిక చేయడం పట్ల ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి హర్షం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన విజయవాడ పార్టీ కార్యాలయంలో వారికి ఆర్. కృష్ణయ్యతో కలిసి మాట్లాడారు. రాజ్యసభ అభ్యర్థి కృష్ణయ్యకు భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు. కేంద్ర నాయకత్వం పంపించిన బి ఫారాలను అందజేశారు. మంగళవారం జరిగే నామినేషన్ ప్రక్రియకు చేయాల్సిన పనులపై వారు చర్చించారు.