ఆళ్లగడ్డలో కూటమి ప్రభుత్వం.. శత దినోత్సవ సంబరాలు
ఆళ్లగడ్డ పట్టణంలో శుక్రవారం ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం సాధించిన విజయాలపై అధికారులు సభ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో భాగంగా ప్రతి సచివాలయం పరిధిలో వార్డు సభలను నిర్వహించి మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని అధికారులు శుక్రవారం తెలిపారు. వార్డ్ టీడీపీ ఇంచార్జ్ రమీజాబీ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.