కోడుమూరు: ఎమ్మార్పీ రేట్లకే పురుగు మందులు విక్రయించాలి
By NIKHIL 61చూసినవారుప్రభుత్వం నిర్ణయించిన ధరలకే పురుగు మందులు, ఎరువులను రైతులకు విక్రయించాలని కోడుమూరు ఏవో రవిప్రకాష్ సూచించారు. శుక్రవారం కోడుమూరు పట్టణంలోని పురుగుమందులు, ఎరువుల దుకాణాలను ఏవో తనిఖీ చేసి, స్టాక్ రికార్డులను పరిశీలించి, మాట్లాడారు. రైతులు అడిగిన మందులను దుకాణదారులు విక్రయించాలని, అనవసరమైనవి అంటగట్టరాదన్నారు. దుకాణదారులు రైతులకు తప్పనిసరిగా రసీదులు ఇవ్వాలన్నారు.