పెద్దకడబూరు: పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని ఏఈతో వాగ్వాదం

50చూసినవారు
పెద్దకడబూరు: పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని ఏఈతో వాగ్వాదం
పెద్దకడబూరు గ్రామంలోని ఎస్సీ కాలనీలో అపరిశుభ్రతను తొలగించి పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని జైభీమ్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఆదాం ఆర్డబ్ల్యూఎస్ ఏఈతో సోమవారం వాగ్వాదం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద అపరిశుభ్రత విలయతాండవం చేస్తున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. డ్రైనేజీలో చెత్తాచెదారం నిండిపోయి కంపు వాసన కొడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్