నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా నందికొట్కూరులోని ఘటన స్థలం వద్ద అమ్మాయి బంధువులను అడిగి వివరాలు తెలుసుకున్నరు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ లహరి నందికొట్కూరులో ఇంటర్మీడియట్ చదువుతుందని, అమ్మాయి, అబ్బాయికి గతంలో కాంటాక్ట్స్ ఉన్నాయన్నారు. ఉదయం 3 గంటలకు సమయంలో ఇద్దరు సూసైడ్ కు ప్రయత్నం చేసి ఉండొచ్చు అని, అబ్బాయి రాఘవేంద్ర అమ్మాయి లహరిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించారని ఎస్పీ అన్నారు.