నంద్యాల జిల్లా బండి అత్మకూరు మండలంలో ఈనెల 22 జరిగిన హత్య కేసును పోలీసులు సోమవారం ఛేదించారు. సుధాకర్ రెడ్డిని హత్య చేసిన నలుగురుముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు వేటకొడవళ్ళు, నాలుగు సెల్ ఫోన్లుస్వాధీనం చేసుకున్నారు. హత్యకు లింగాపురం గ్రామంలో ఆరు సెంట్ల స్థల వివాదమే కారణమని నంద్యాల ఏ. ఎస్పి ఆల్ఫాన్సా నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్లో వివరించారు. హత్య జరిగిన 48 గంటల్లోనే ముద్దాయిలను అరెస్టు చేశారు.