ఎమ్మిగనూరు పట్టణంలోని జూనియర్ సివిల్ న్యాయాధికారి కోర్టులో శనివారం జరిగిన లోక్ అదాలత్లో 1457 కేసులు పరిష్కారం అయ్యాయి. కోర్టు అధికారులు తెలిపిన సమాచారం మేరకు న్యాయాధికారులు జోష్ణదేవి, శ్రీలత ఆధ్వర్యంలో లోక్ అదాలత్ నిర్వహించారు. రాజీ కేసులు 52, చెక్ బౌన్స్ కేసులు రెండు, సివిల్ దావాలు నాలుగు, మద్యం కేసులు 23, అడ్మిషన్ కేసులు 1496 పరిష్కారం చేశారు. ఏపీపీ సాల్మాన్, గురురాజారావు ఉన్నారు.