ఎమ్మిగనూరులో వెలసిన శ్రీ నీలకంఠేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా దివంగత నేత, మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి స్మారక ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం పట్టణంలోని వీవర్స్ కాలనీ గ్రౌండ్ లో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది ఆటల పోటీల ప్రారంభం రోజే వర్షం పడటం శుభ పరిణామమని తెలిపారు.