ఎమ్మిగనూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బీవీ మధుసూదన్ రావు బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ సీఐగా పనిచేసిన బీవీ. విక్రంసింహా కర్నూలు వీఆర్ కు వెళ్లగా, కర్నూలు సీసీఎస్ లో పనిచేస్తున్న సీఐ బీవీ మధుసూదన్ రావును ఇక్కడికి సీఐగా నియమించారు. ఆయనకు రూరల్ ఎస్సై శ్రీనివాసులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డిని కలిశారు.