నేడు ఆచంట మండల పరిషత్ సమావేశం
ఆచంట మండల పరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం ఉదయం 10 గంటలకు ఎంపీపీ దిగుమర్తి సూర్యకుమారి అధ్యక్షతన జరగనున్నట్లు ఎంపీడీవో పూర్ణ బాబ్జి మంగళవారం తెలిపారు. ఈ సమావేశానికి ఎంపీటీసీ సభ్యులు, మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్లు ఆయా శాఖల అధికారులు పాల్గొవాలని కోరారు. ఈ సమావేశంలో సభ్యులు లేవనెత్తిన అంశాలు, ఎజెండాలో పొందుపరచిన వివిధ అంశాల పై చర్చించనున్నట్లు తెలిపారు.