పెనుమంట్ర మండలం మార్టేరులోని శివరావుపేట ఎంపీపీ పాఠశాలలో శనివారం మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులచే ఇంగ్లీష్ డిక్టేషన్, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహింపచేశారు. ప్రధాన ఉపాధ్యాయురాలు చంద్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చైర్మన్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ ఈశ్వరి, అంగన్వాడి టీచర్లు సరస్వతి, భాగ్యలక్ష్మి, స్థానిక కూటమి నాయకులు, వార్డ్ మెంబర్లు, ఆయాలు, విద్యార్థులు పాల్గొన్నారు.