పాలకొల్లు పట్టణంలోని బస్ స్టాండ్, సంత బజారు తదితర రద్దీ ప్రదేశాలలో సంచరించే ఆవులకు చీకట్లో ఎలాంటి ప్రమాదం సంభవించకుండా, మానవత సభ్యులు సోమవారం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా చీకట్లో సైతం వాహనదారులకు రహదారులపై ఉన్న ఆవులు కనబడి, ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు ఆవులకు రేడియం బెల్టులు అమర్చినట్లు సంస్థ సభ్యులు వంశీ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవత సభ్యులు పాల్గొన్నారు.