ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజనతో ప్రయోజనాలు ఉన్నాయని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పేర్కొన్నారు. గురువారం ఆదోని వీఏస్బీ పంక్షన్ హాల్లో పీఎం సూర్య, ఘర్ యోజన పథకంపై అవగాహన సమావేశం నిర్వహించారు. సూర్యఘర్ ద్వారా పర్యావరణాన్ని కాపాడినవారవుతారన్నారు. 1 కేవీ లోడ్ 120 యూనిట్టకు బిల్లు రూ. వెయ్యి వచ్చేదని, సోలార్‌తో రూ. 338లు మాత్రమే వస్తుందన్నారు. ఏడాదికి రూ. 8వేల వరకు పొదుపు చేసుకోవచ్చన్నారు.