మంత్రాలయంలో పరిమళ విద్యా నికేతన్‌లో శ్రీ శ్రీ కళావేదిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన జాతీయ శతాధిక కవి సమ్మేళనంలో ఆలూరు మండలం కమ్మరచేడు గ్రామానికి చెందిన యువకవి రాజశేఖర్ "నీ వాళ్ళు ఎవరూ" శీర్షికపై కవిత గానం చేశారు. కత్తిమండ ప్రతాప్, కేశవయ్య చేతుల మీదుగా ఆయనను ప్రశంసాపత్రం, జ్ఞాపికతో సత్కరించారు.