హోళగుంద: ఉధృతంగా ప్రవహిస్తున్న వేదవతి - రాకపోకలు బంద్
హొళగుంద మండలం మార్లమడికి గ్రామం వద్ద వేదవతి నదీ గురువారం ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. వంతెన అంచులు తాకుతూ నది ప్రవహిస్తుండటంతో భారీ వాహనాలు రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఎగువన అనంతపురం జిల్లా, కర్ణాటక రాష్ట్రంలో భారీ వర్షాలు వస్తుండటంతో నదికి వరద ఉద్ధృతి అధికంగా వస్తోందని స్థానికులు తెలిపారు. వరద నీటి రాకతో పంటలు నీట మునిగాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.