కర్నూలు నగరం పుల్లారెడ్డి కాలేజీ సమీపంలో ఉన్న రేమా గ్లోబల్ చర్చి 25వ వార్షికోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాస్టర్ మోహన్ బాబు హాజరై వాక్యోపదేశం చేశారు. చర్చి స్థాపకులు రెవరెండ్ ప్రమోద్ జాషువా, ఆయన సతీమణి పాస్టర్ బ్లెస్సి జాషువా మాట్లాడుతూ ఎన్నో కష్టాలను అధిగమించి 25వ వార్షికోత్సవానికి చేరుకున్నామన్నారు. చర్చిలో వివిధ విభాగాల్లో పరిచర్య చేస్తున్న వాలంటీర్లకు, పాస్టర్లకు జ్ఞాపికలు అందజేసి సత్కరించారు.