కర్నూలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను గురువారం నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు పరిశీలించారు. పాతబస్తీ, బంగారుపేట, సంకల్బాగ్, కల్లూరు ప్రాంతాల్లో ఆయన విస్తృతంగా పర్యటించి, పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. ఆయన మాట్లాడారు. ప్రజల ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఎక్కడ కూడా పారిశుద్ధ్యం లోపించరాదన్నారు. పరిమళ నగర్, సెట్కూరు కార్యాలయం సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్లను పరిశీలించారు.