పేదవాడి ఆకలి తీర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత పేర్కొన్నారు. శనివారం కల్లూరు అర్బన్ పరిధిలోని పరిమళనగర్, కల్లూరు ఎస్టేట్లో రెండు అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించారు. ఎమ్మెల్యే గౌరుచరిత పేదలకు అన్నం వడ్డించి, వారితో కలిసి అన్న క్యాంటీన్ లో భోజనం చేశారు. గౌరుచరిత మాట్లాడారు. ఐదు రూపాయలకే పేదల కడుపునింపే బృహత్తర కార్యక్రమానికి ఎన్డీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.