రైతులకు పెట్టుబడి సహాయం కింద తక్షణమే 20 వేల రూపాయలు అందించాలని ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మిడుతూరు మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించబడింది. ఈ ధర్నాకు మాని కింది నాగశేషులు అధ్యక్షత వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి వచ్చిన రైతులు పాల్గొన్నారు.