శ్రీశైలంలో వైభవంగా గిరిప్రదక్షిణ
శ్రీశైలం పౌర్ణమి ఘడియలు ఉండడంతో దేవస్థానం శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నది. స్వామిఅమ్మవార్ల మహామంగళహారతుల అనంతరం ఈ గిరిప్రదక్షిణ ప్రారంభవుతుంది. ఆలయ మహాద్వారం నుండి మొదలైన ఈ ప్రదక్షిణ గంగాధరమండపం, అంకాళమ్మ ఆలయం, నందిమండపం, బయలువీరభద్రస్వామి ఆలయం నుండి అలంకారేశ్వర ఆలయం మీదుగా వలయ రహదారిపైకి చేరుకుంటుంది. ఈ కార్యక్రమంలో అధికారులు భక్తులు మంగళవారం పాల్గొన్నారు.