తణుకు: చిన్నారి వైద్యానికి అండగా నిలబడ్డ ఎమ్మెల్యే
తణుకు మండలం మండపాక గ్రామానికి చెందిన చీలి సురేష్ అనూష దంపతుల 15 నెలల కుమార్తెకు గుండె సమస్య ఉందని ఎమ్మెల్యే రాధాకృష్ణ దగ్గరికి వచ్చి సమస్యను విన్నవించుకున్నారు. వెంటనే ఎమ్మెల్యే హైదరాబాద్ స్టార్ హాస్పెటల్ వైద్యులతో మాట్లాడి ఆపరేషన్ చేయించడం జరిగింది. రూ. 10 లక్షల వైద్యాన్ని ఉచిత చేయించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణకి వారి తల్లిదండ్రులు ఆదివారం కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.