ఎమ్మిగనూరు పట్టణంలో ప్రభుత్వాసుపత్రి ఆవరణంలో నిర్మాణంలో ఉన్న వంద పడకల ఆసుపత్రి పనులు వచ్చేనెల మొదటి వారంలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆదేశించారు. పనుల పురుగతిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశానికి ఎమ్మెల్యే హాజరై, మాట్లాడారు. వైద్యులు, సిబ్బంది ఖాళీలు, సమస్యలపై చర్చించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వందపడకలకు నిధులు మంజూరు చేయించామన్నారు.