ఉదయగిరి: అక్కడ సరిగా వర్షాలు పడకపోవడంతో రైతులకు నిరుత్సాహం

53చూసినవారు
గత నెలలో వచ్చిన తుఫాన్ కు ఉదయగిరి, సీతారాంపురం మండలాల్లో పడిన వర్షాలకు చెరువులు, బావులు నిండి భూగర్భ జలాలు అభివృద్ధి చెందాయి. మరోసారి ఈ నెలలో ఫంగల్ తుఫాన్ కారణంగా వాతావరణం మారడంతో రైతులు వరి నారులు వేశారు. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపినప్పటికీ ఈ రెండు మండలాల్లో మోస్తారు వర్షాలు కూడా పడకపోవడంతో రైతులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్