వరికుంటపాడు: స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ ర్యాలీ

84చూసినవారు
వరికుంటపాడు మండల కేంద్రంలో స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయం నుంచి బస్టాండ్ సెంటర్ వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి అనంతరం అక్కడ మానవహారం ఏర్పాటు చేశారు. మన పరిసరాలతో పాటు పర్యావరణాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎంపీడీవో వేణుగోపాల్ తెలిపారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్నారు.

సంబంధిత పోస్ట్