మైలవరం: వెల్వడంలో మద్యం షాపు వద్దంటూ ఆందోళన
మైలవరం మండలం వెల్వడం గ్రామంలో మద్యం దుకాణం పెట్టొద్దంటూ పలువురు మహిళలు ఆందోళనకు దిగారు. వెల్వడం గ్రామంలో బుధవారం నూతనంగా మద్యం షాపు ఏర్పాటుకు సదరు యజమాని ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన కొందరు మహిళలు ఈ ప్రాంతంలో వైన్ షాపు పెట్టవద్దు అంటూ ఆందోళనకు దిగారు. తమ గ్రామంలో మద్యం షాపు అవసరంలేదని, షాపును ప్రారంభిస్తే ఆందోళన ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు.