పెట్రోల్ బంకులో వినియోగదారుడిపై దురుసు ప్రవర్తన
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ చుట్టుగుంట బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి హెచ్.పి పెట్రోల్ బంక్ పని చేసే ఓ మహిళ వినియోగదారులతో దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. శుక్రవారం ఈ మహిళ వినియోగదారులతో వాగ్వివాదం చేయడంతో పాటు ఏకంగా చెప్పుతో దాడి చేసింది. కాగా ఈ బంకులో పనిచేసే సిబ్బంది వినియోగదారుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని అనేక మార్లు ఫిర్యాదులు వెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదు.