విజయవాడ: సూర్య ఘర్లో ఆర్థిక స్వావలంబన వెలుగులు
దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా జిల్లాలోని ప్రతి ఇంటా సూర్యఘర్తో ఆర్థిక స్వావలంబన వెలుగులు నిండాలని, పథకాన్ని సద్వినియోగం చేసుకొని, వారసత్వ సంపదగా అందిద్దామని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. శనివారం నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో డీఆర్డీఏ, విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో మహిళలకు పీఎం సూర్యఘర్ పథకంపై అవగాహన సదస్సు జరిగింది.