కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలిచే విషయంలో అర క్షణం కూడా ఆలోచించబోనని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు అన్నారు. ఈ మేరకు విజయవాడలో పలు ప్రాంతాల్లో గురువారం పాలు, పండ్లు, మంచినీరు అందించారు. పలు ప్రాంతాలకు స్వయంగా ట్రాక్టర్ నడిపి సరుకులు తరలించారు. వరదలతో అవస్థలు పడుతున్న ప్రజలకు అండగా నిలిచే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. ప్రతి కుటుంబానికి అండగా తొడుంటానని చదలవాడ అన్నారు.