ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా గరుగుబిల్లి మండలంలోని కొత్తపల్లి గ్రామంలో మంగళవారం వైద్యాధికారి డాక్టర్ సాగర్ వర్మ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమల ద్వారా వచ్చే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాల చుట్టూ నీటి నిల్వలు లేకుండా దోమల పెరుగుదలను అరికట్టాలని ప్రజలకు సూచించారు.