నెల్లిమర్ల నియోజకవర్గంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు క్రీడాస్థలాలు కేటాయించడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ ఆదివారం జనసేన నాయకులు పతివాడ గోవిందరావు, తదితరులు భోగాపురం మండలం ముంజేరు జనసేన కార్యాలయంలో ఎమ్మెల్యే లోకం నాగ మాధవి కి వినతి పత్రం అందజేశారు. అలాగే కొండగుంపాం అభివృద్ధికి నిధులు మంజూరు చేసి సహకరించాలని కోరారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో గల పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు.