పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఏపీ మార్క్ ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు వెల్లడించారు. నెల్లిమర్ల నగరపంచాయతీలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమం చైర్ పర్సన్ బంగారు సరోజిని ఆధ్వర్యంలో నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అన్నారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కమిషనర్ అప్పలరాజు, కూటమి నాయకులు సువ్వాడ రవిశేఖర్ కడగల ఆనంద్ కుమార్, లెంక అప్పలనాయుడు పాల్గొన్నారు.