రైతుకు అన్ని విధాలా అండగా నిలబడతామని మంత్రి నాదేండ్ల మనోహర్ అన్నారు. కొనుగోలు చేసిన 48 గంటల్లోనే ధాన్యం డబ్బులు జమ చేస్తున్నామని చెప్పారు. డెంకాడ మండలం చందకపేట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ ఏడాది 78వేల మెట్రిక్ టన్నులను కొనుగోలు చేశామని మంత్రి చెప్పారు. 24 గంటల్లోనే సుమారు 16000 మంది రైతులకు రూ. 174 కోట్లు చెల్లించామని తెలిపారు.