నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు పక్కా రహదారులు

75చూసినవారు
పార్వతీపురం నియోజకవర్గంలో ఉన్న మూడు మండలాల అన్ని గ్రామాలకు రహదారులు మరమ్మతులతో పాటు పక్క రోడ్ల నిర్మాణాలు జరుపుతామని ఎమ్మెల్యే విజయచంద్ర అన్నారు. శుక్రవారం మండలంలోని వెలగవలస రోడ్డు నుండి డోకిశిల వయ ఎన్ ములగ మీదుగా రూ. 285 లక్షల అంచనాతో నిర్మించబోయే బీటీ రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. గత ప్రభుత్వం రహదారుల మరమ్మత్తులు నిర్వహణను గాలికి వదిలి వయడంతో రోడ్లన్నీ గుంతలుగా మారిపోయాయని అన్నారు.

సంబంధిత పోస్ట్