పార్వతీపురం పట్టణం మద్దాలవారివీధిలో ఎల్ఈడి వీధిలైట్లు ఏర్పాటు చేశారు. అధికారులు సిబ్బంది నిర్లక్ష్యంతో చాలాచోట్ల వీధిలైట్లు రాత్రి పగలు వెలుగుతూనే ఉన్నాయని శుక్రవారం స్థానికులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదు చేసిన మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సిబ్బంది స్పందించి విద్యుత్ వృధాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.