భామిని మండలంలోని భామిని, సింగిడి, బత్తిలి గ్రామాలలో ఉన్న పురుగుమందుల షాపులను గురువారం సాలూరు వ్యవసాయ సహాయ డైరెక్టర్, మండల వ్యవసాయ అధికారి కే. సింహాచలం డివిజనల్ అంతర్గత తనిఖీలు చేశారు. డీలర్స్ దగ్గర ఉన్నటువంటి పురుగుమందులకు సంబంధించి ప్రిన్సిపల్ సర్టిఫికెట్, లైసెన్సులు, స్టాక్ రిజిస్టర్లు తనిఖీ చేశారు. అదేవిధంగా పురుగుమందులకు సంబంధించి రైతులకు నగదు రసీదులు సరిగా ఇస్తున్నారా లేదా పరిశీలించారు.