సాలూరు: తుఫాను ముందుంది వరి కోతలు ఆపండి
సాలూరు మండలంలో వరి పంట కోత దశకు వచ్చిందని, అయితే రానున్న రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కోతలు కోయ్యరాదని మండల వ్యవసాయ శాఖ అధికారిణి అనురాధ పండా అన్నారు. బుధవారం మామిడిపల్లిలో తహశీల్దార్ తో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుతం రైతుల వద్ద ఉన్న ధాన్యం తేమ శాతం బాగుందన్నారు. ఇటీవల వర్షాలు కురవనందున 12నుండి 15శాతం ఉందన్నారు.