విజయనగరం:విద్యార్థులకు తప్పని తిప్పలు
సాలూరు మండలం శివరాంపురం జెడ్పీ హైస్కూల్లో 190మంది చదువుకుంటున్నారు. వారిలో చినపారన్నవలస, పెదపారన్నవలస గ్రామాలకు చెందిన 20మంది విద్యార్థులు నిత్యం వేగావతి నదిని దాటుకుంటూ శివరాంపురం చేరుకోవాల్సి వస్తోంది. పదేళ్ల కిందట నిర్మించతలపెట్టిన వంతెన పనులు ఇప్పటికీ పూర్తికాకపోవడంతో చిన్నారులకు అవస్థలు తప్పడం లేదు. వంతెన నిర్మాణానికి రూ. 5.95 కోట్ల నిధులు మంజూరయ్యాయని, టెండర్లు పూర్తికావాలన్నారు.