ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని గిద్దలూరు ఎమ్మార్వో కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మార్వో ఆంజనేయ రెడ్డితో కలిసి జండాకు గౌరవ వందనం చేశారు. ఎందరో మహానుభావులు స్వాతంత్ర సమరయోధులు మనకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో కార్యాలయ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.